భారత మాజీ ఉప ప్రధాని డా.బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతిని ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీస్ శాఖ
అనకాపల్లి, ఏప్రిల్ 5: భారత మాజీ ఉప ప్రధాని, గొప్ప సమాజ సేవకుడు డా.బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతిని పురస్కరించుకొని, జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీ ఇ.శ్రీనివాసులు గారు, ఇతర పోలీస్ అధికారులు కలిసి డా. బాబు జగ్జీవన్ రామ్ గారి చిత్రపటానికి పుష్పమాలలు సమర్పించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా డీఎస్పీ గారు మాట్లాడుతూ, “డా. బాబు జగ్జీవన్ రామ్ గారు నేటి తరానికి ఆదర్శప్రాయుడు. అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం అందించేందుకు, సమానత్వం స్థాపించేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. భారతదేశ రాజ్యాంగంలో సామాజిక న్యాయాన్ని సుస్పష్టం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, రాజకీయ నాయకుడిగా, పరిపాలనదక్షుడిగా దేశానికి ఎంతో సేవలందించారు. ఆయన ఆశయాలను అనుసరిస్తూ, సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్.బి ఇన్స్పెక్టర్ శ్రీమతి టి.లక్ష్మి గారు, ఇతర జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
- @APPOLICE100