ఖనిలో దొంగతనాలు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్: 1టౌన్ పోలీసులు
Bbma news /గోదావరిఖని: నవంబర్24
గోదారిఖనిలో కారు నడుపుకుంటూ వచ్చిన డబ్బులతో జల్సా లు చేస్తూ త్రాగుడుకు అలవాటు పడిన ఐత వెంకటేష్ డబ్బుల కోసం ఇతరుల దగ్గర అప్పులు చేస్తూ, అప్పులు తీర్చడం కోసం దొంగతనాలు చేస్తున్నాడు. మధ్యాహ్నం వేళల్లో తాళం వేసి విన్న ఇండ్లను గమనిస్తూ…. రాత్రి సమయాల్లో తాళం వేసిన ఇంట్లో కి చొరబడి బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, పైసలు, ఇతర వస్తువులు ఎత్తుకెళ్లి అమ్ముకొని వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నాడని, గత వారం క్రితం ద్వారకా నగర్ లో జరిగిన దొంగతనం కేసులో నాలుగు తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లి తాకట్టు పెట్టి, తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేయగా సాంకేతిక పరిజ్ఞానంతో వెంకటేష్ దొంగతనం చేసినట్టుగా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం వెంకటేష్ దగ్గర నుండి దొంగిలించిన బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. కేసును చేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై భూమేష్ , కానిస్టేబుల్ క్రైమ్ టీమ్ శ్రీనివాస్, వెంకటేష్ లను సిఐ ఇంద్రసేనారెడ్డి అభినందించారు.