రక్తసిక్తమైన రాజీవ్ రహదారి…!
నిండు ప్రాణాన్ని బలితీసుకున్న ఆర్&బి నిర్లక్ష్యం.?
బి బి ఎం ఎ న్యూస్ /పెద్దకల్వల: నవంబర్24
పెద్దపల్లి జిల్లా పట్టణ కేంద్రానికి సమీపంలోని పెద్ద కల్వల గ్రామ రాజీవ్ రహదారి నిర్మాణ మరమ్మత్తుల పేరుతో ఆర్&బి అధికారులు రహదారిని తవ్వి వదిలేశారు. రోడ్డు పై ఎలాంటి సూచనలు లేకపోవడం మోటార్ సైకిల్ అదుపు తప్పింది. వెనుకాల వస్తున్న లారీ డీకోనడంతో 11సం”ల హర్షవర్ధన్ అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు కెళ్తే పెద్దపల్లి నుంచి సుల్తానాబాద్ మండలం కందులూరు పల్లె వెళ్లే క్రమంలో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ ని వదిలేసి డ్రైవర్ తప్పించుకొని పారిపోయాడు. ఈ ప్రమాదంలో కందునూరుపల్లి నివాసి కొప్పుల శంకర్-శైలజ ల ప్రథమ కుమారుడు హర్షవర్దన్ మృతిచెందాడు. తల్లిదండ్రుల కడుపుకోతకు కారకులు ఎవరు? రహదారి అధికారుల నిర్లక్ష్యం కొట్టచ్చినట్లు కనిపిస్తున్నదని వాహన దారులు, స్థానిక ప్రజలు వాపోయారు. నిర్లక్ష్యం వహించిన ఆర్&బి అధికారులు, అజాగ్రత్తగా నడిపిన లారీ డ్రైవరుపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.