ప్రైవేట్ ఆస్పత్రిలో అర్హత లేని వైద్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి….
డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి తిరుపతి…..
అక్షర వేదం/ కరీంనగర్,
ప్రైవేట్ ఆస్పత్రిలో అర్హత లేని వారు వైద్య చికిత్స అందిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైద్యులపై తక్షణమే శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి తిరుపతి…
స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ పలిమేల సత్పతి కి తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్ కలిసి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి మాట్లాడుతూ పట్టణ కేంద్రంలో అర్హత లేని వైద్యులు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నెలకొల్పి వైద్యులుగా చలామణి అవుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ వివిధ రకాల రక్తపరీక్షలు సిటీ స్కాన్ ఎమ్మారై స్కాన్లు చేయిస్తూ ప్రజలను ఆర్థిక దోపిడీ చేస్తున్న ఆసుపత్రి అర్హత లేని వైద్యులను గుర్తించి శాఖపరమైన చర్యలు తీసుకోవడంలో జిల్లా వైద్యాధికారులు విఫలమయ్యారని ఆయన అన్నారు. ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ 2019 తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రూల్స్ 2013 టి ఎం పి ఆర్ యాక్ట్ 1968 ప్రకారం అర్హత లేకుండా క్లినిక్లు నిర్వహిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మెడికల్ కౌన్సిల్ స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు. ఎన్ఎంసి 2013 2019 లో సెక్షన్ 34 రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్ కాకుండా మరెవరు మెడిసిన్ ప్రాక్టీస్ చేయడం నిషేధం నిబంధనలు ఉల్లంఘించిన వారికి జైలు శిక్ష ఐదు లక్షల వరకు జరి మన విధించాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయని ఆయన గుర్తు చేశారు. కానీ ఆ నిబంధనకు విరుద్ధంగా డబ్బులు వ్యాపార దృక్పథంతో అర్హత లేని వైద్యులు ఆస్పత్రులు నెలకొల్పి భృణ హత్యలు వివిధ స్కాన్లు పేరుతో లక్షల్లో దోపిడీ చేస్తున్నా కానీ పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే జిల్లా వైద్యాధికారులు నిజనిర్ధారణ కమిటీ పెట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ నిర్వహిస్తే ఇలాంటి సంఘటనలను అరికట్టవచ్చని ఆయన అన్నారు. ఇప్పటికైనా నిజం నిర్ధారణ కమిటీ పెట్టి నిబంధనలను పాటించని ఫైర్ సేఫ్టీ పార్కింగ్ స్థలాలు లేని ఆస్పత్రులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.