తెలంగాణ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

0
12

తెలంగాణ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

బిబిఎంఎ న్యూస్ హైదరాబాద్ నవంబర్ 26 :

ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు పొందిన మన భారత రాజ్యాంగమని ప్రముఖ న్యాయశాస్త్ర ప్రొఫెసర్, తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్ఠ రెడ్డి అన్నారు. తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ప్రతి ఇంట్లో ధర్మ గ్రంథంతో పాటు భారత రాజ్యాంగం ఉండాల్సిన అవసరం ఉందని, ప్రతి పౌరుడు రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలని, గ్రామీణ ప్రాంతాల్లో చట్టం కల్పించిన హక్కులను తెలియజేయాలన్నారు. తెలంగాణ మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్, హైకోర్టు రిటైర్డ్ జడ్జి డాక్టర్ జస్టిస్ డాక్టర్ జి.చంద్రయ్య మాట్లాడుతూ ప్రజల్లో రాజ్యాంగం విలువ పట్ల అవగాహన పెంచడంతో పాటు రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించేలా న్యాయవాదులు, మేధావులు కృషి చేయాలన్నారు. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నారాయణ మాట్లాడుతూ రాజ్యాంగం అంటే కేవలం రాత ప్రతి కాదని ఒక జాతి జీవన విధానం అని దేశమంతటికి నిరంతర చైతన్య స్ఫూర్తి అని అన్నారు. తెలంగాణ హైకోర్టు మాజీ ప్రభుత్వ లీడర్ డిఎల్.పాండు మాట్లాడుతూ అంబేద్కర్ నేతృత్వంలో రూపొందించిన భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం దేశాలకే దిక్సూచి అనడంలో సందేహం లేదన్నారు. తెలంగాణ మేధావులు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డా.రాజ్ నారాయణ ముదిరాజ్ స్వాగత ఉపన్యాసం చేస్తూ గత 40 సం.లుగా చేసిన కార్యక్రమాలను నివేదికను సమర్పించారు. మేజర్ డాక్టర్ డి.జయసుధ చౌదరి, డా.మొహమ్మద్ అత్తర్ అలీ, డా.ధనుంజయ నాయక్, డా.రవితేజ తదితరులు ప్రసంగించారు. లా కళాశాల విద్యార్థిని కుమారి స్నేహ సింగ్ చేసిన ప్రసంగాన్ని న్యాయమూర్తులు మేధావులు అందరూ మెచ్చుకొని అభినందించారు. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు స్వదేష్, అయోధ్య సాయి చక్రవర్తి, వి.చెత్రు నాయక్, దర్గ గూటి ఎట్టయ్య, డి.రాజిరెడ్డి, ఖానాపురం అమూల్య, మృతజవా అహ్మద్ అమీర్ లకు జ్యూరిస్ట్ అవార్డు-24ను ముఖ్య అతిథులు బహుకరించారు. సేవా రత్న పురస్కార గ్రహీతలు ఎల్.సి.గోపయ్య, ఎస్.దీపక్ రాజ్, జి.వీరమ్మ, కెప్టెన్ డా.మడుగు విజయ్ కుమార్, డా.మీరా, మహమ్మద్ జాహిద్ దాని, శ్రీనివాస్ గండే మల్లె, ఫారూఖ హెయిర్, పూరికా అర్పిత, ఎం.కిరణ్మయి, దీపాంకర్ పాల్, వాణి రాణి, రుద్రారం అంజయ్య ముదిరాజ్, డా.బి.శ్యామలను సేవారత్న పురస్కారాలు శాలువా మెమొంటోలతో ముఖ్య అతిథి ఇతర న్యాయమూర్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బత్తుల హేమంత్, ఢిల్లీ శివకుమార్, మొహమ్మద్ అత్తర్ షరీఫ్, తహసేన్ సభ, మొహమ్మద్ ఉస్మాన్ కో-ఆర్డినేటర్ గా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here