కొనుగోలు చేసిన ధాన్యం త్వరితగతిన తరలించాలి. జిల్లా కలెక్టర్

0
8

కొనుగోలు చేసిన ధాన్యం త్వరితగతిన తరలించాలి. జిల్లా కలెక్టర్

కొనుగోలు చేసిన ధాన్యం వివరాల ట్యాబ్ ఎంట్రీ 100 శాతం పూర్తి చేయాలి.

బిబిఎంఎ న్యూస్ / పెద్దపల్లి ప్రతినిధి,

పెద్దపల్లి, నవంబర్ -27

దాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం తేమ శాతం 17 రాగానే కొనుగోలు చేసి త్వరితగతిన తరలించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.

బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి మండలంలోని అప్పన్నపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం నాణ్యతను నిరంతరం పరిశీలించాలని, ధాన్యం తేమ శాతం 17 రాగానే వెంటనే కొనుగోలు చేసి, సెంటర్ కు కేటాయించిన రైస్ మిల్లులకు త్వరితగతిన తరలించే లా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మన జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలని, 100% కొనుగోలు ధాన్యం వివరాల ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. రైస్ మిల్లుల వద్ద ఎటువంటి కోతలు లేకుండా చూడాలని అన్నారు.   ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here