దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో గల అగనంపూడి టోల్ గేట్ సమీపంలో అక్రమంగా గంజాయి రవాణా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ మరియు దువ్వాడ పోలీసు వారు వాహన తనిఖీలు నిర్వహించారు.
కారులో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 135 KGs గంజాయి, 02 KGs హాసిస్ ఆయిల్, ఒక కార్ స్వాధీనం చేసుకున్నారు. సిపి డా. శంఖబ్రత బాగ్చి, ఐపీఎస్, గారు టాస్క్ ఫోర్స్ మరియు దువ్వాడ పోలీసులను అభినందించారు. @APPOLICE100 @dgpapofficial