వార్షిక తనిఖీల్లో భాగంగా దేవరాపల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపిఎస్., గారు.
పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సెంటర్ సిబ్బంది ఫిర్యాదారుల సమస్యలు తెలుసుకుని పరిష్కార దిశగా సహకరించాలి:జిల్లా ఎస్పీ.
దేవరాపల్లి , డిసెంబర్ 04 : వార్షిక తనిఖీల్లో భాగంగా అనకాపల్లి సబ్ డివిజన్ పరిధిలో కె.కోటపాడు సర్కిల్ , దేవరాపల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపిఎస్., గారు.
పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సెంటర్ సిబ్బంది ఫిర్యాదారుల సమస్యలు తెలుసుకుని పరిష్కార దిశగా సహకరించాలని జిల్లా ఎస్పీ తెలిపారు.
మహిళలు, బాల బాలికలపై జరిగే నేరాలు పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని, సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని ఎటువంటి అలసత్వం ఉండకూడదని హెచ్చరించారు.
దొంగతనాలు మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నివారించేందుకు పగలు, రాత్రి గస్తీలను పునర్వ్యవస్థీకరించి నేరాలు నివారించేందుకు పటిష్ట గస్తీ ఏర్పాటు ఏర్పాటు చేయాలన్నారు.
గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు మరియు రవాణా జరిగే మార్గాలలో ఆకస్మిక/ డైనమిక్ తనిఖీలు నిర్వహించాలని తెలిపారు.
తీవ్రమైన కేసుల సీడీ ఫైల్స్ ను పరిశీలించి, ఆయా కేసుల పురోగతిని తెలుసుకుని తగు సూచనలు ఇచ్చారు. స్టేషను ప్రాంగణంలో గల వాహనాలు ఏ కేసుల్లో సీజ్ చేసినవి, ఎందుకు స్టేషను ప్రాంగణంలో ఉన్నవి అన్న విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీజ్ చేసిన వాహనాలకు ఆయా కేసుల వివరాలను ట్యాగ్ చేయాలన్నారు.
సైబర్ నేరాలు పట్ల ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలు గురించి ప్రజలకు తెలియజేసి, సైబర్ నేరాలు జరగకుండా అడ్డుకట్ట వేయాలని తెలియజేశారు.
రోడ్డు ప్రమాదాల నివారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ కేసులు నమోదు చేయాలని, రోడ్డు భద్రతా నియమాల పట్ల ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారించేందుకు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించే లా పటిష్టంగా ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు .
రౌడీ షీటర్స్ మరియు చెడునడత కలిగిన వ్యక్తుల వివరాలు తెలుసుకుని, ప్రస్తుతం వారు జీవనోపాధికి ఏమేమి పనులు చేస్తున్నారో ఆరా తీశారు. వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.
పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులు మరియు సమస్యలు గూర్చి ఆరా తీశారు. జి.ఎం.ఎస్.కే లు అనుసంధానంతో సమస్యాత్మక ప్రాంతాలు మరియు వార్డులలో తరచూ సందర్శించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా ఎస్పీ గారు వార్షిక తనిఖీలు నిర్వహించిన సమయంలో అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీమతి ఎం.శ్రావణి , కె.కోటపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.పైడపు నాయుడు , ఎస్సై టి.మల్లేశ్వర రావు మరియు సిబ్బంది హాజరు గా ఉన్నారు.
@APPOLICE100