సంధానకర్తలుగా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పని చేయాలి
యువజన కాంగ్రెస్ నేతల సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి పిలుపు…
బిబిఎంఎ న్యూస్ / మానకొండూర్,
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య యువజన కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు సంధానకర్తలుగా పని చేయాలని పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, మానకొండూర్ శాసనససభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో మానకొండూర్ నియోజకవర్గ అధ్యక్షుడుగా అట్ల అనిల్ కుమార్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులుగా ఎన్నికైన కోండ్ర సురేష్ (మానకొండూర్), కర్ర మణికంఠ (తిమ్మాపూర్), రాపోలు నవీన్ (గన్నేరువరం), కర్రావుల సందీప్ (బెజ్జంకి), ఎర్రోజు సంతోష్ (ఇల్లంతకుంట)లు గురువారం మర్యాదపూర్వ కంగా ఎమ్మెల్యేను క్యాంపు కార్యాలయంలో కలిసినప్పుడు ఆయన వారిని శాలువాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంలోనే కాకుండా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు క్రీయాశీలక పాత్ర పోషించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలనపై నిర్వహిస్తున్న ప్రజాపాలన -ప్రజావిజయోత్సవాల్లో యువజన కాంగ్రెస్ శ్రేణులు భాగస్వాములు కావాలన్నారు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ యువజన కాంగ్రెస్ కష్టపడి పని చేయాలన్నారు. అన్ని పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన వారిని గెలిపించే బాధ్యత యువజన కాంగ్రెస్ పైననే ఉందని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు
ఈ కార్యక్రమంలో మానకొండూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నందరిగి రవీంద్రచారి, మానకొండూర్ వ్యవసాయ మార్కెక్ కమిటీ చైర్మన్ మర