విశాఖపట్నం రేంజ్ కార్యాలయము ను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ గౌరవ డీజీపీ శ్రీ సిహెచ్.ద్వారక తిరుమల రావు ఐపీఎస్., గారు..
విశాఖపట్నం, డిసెంబర్ 6: ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి గారు, డీజీపీ గారికి మర్యాదపూర్వకంగా కలసి పూల మొక్కను అందజేశారు.
అనంతరం డీజీపీ గారు ఏర్పాటు చేసిన సమావేశంలో విశాఖపట్నం రేంజ్ డిఐజి, శ్రీకాకుళం ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి ఐపీఎస్ మరియు పార్వతిపురం మన్యం ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ఐపీఎస్ గారు పాల్గొన్నారు .
ఈ సమావేశంలో డీజీపీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి ఇతర మత్తు పదార్థాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలని, ముఖ్యంగా ఏ.ఓ.బి మరియు మన్యం ఇతర ప్రాంతాల నుండి గంజాయి పంటను గుర్తించి ధ్వంసం చేయాలన్నారు. అలాగే గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని తెలిపారు. ఒడిస్సా మరియు రేంజ్ పరిధిలో ఉన్న జిల్లాల అధికారులు సమన్వయంతో అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్ పోస్ట్ లను, డైనమిక్ చెక్ పోస్ట్ లను పటిష్టం చేయాలని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే గంజాయి వ్యాపారస్తులు గిరిజనులను మభ్యపెట్టి వారిని ఉచ్చులోకి లాగుతున్నారని, గ్రామాల్లో గంజాయి పంట వలన జరిగే నష్టాలను మరియు వాణిజ్య పంటలు వేసుకునేలా గిరిజనులు ప్రోత్సహించాలని మరియు అవగాహన కల్పించాలన్నారు.
అక్రమ రవాణా కోసం నిరంతరం నిఘా ఉంచుతూ వాహనాలు ముమ్మర తనిఖీలు చేయాలని మరియు చెక్ పోస్ట్ ల వద్ద సీసీటీవీ కెమెరా ద్వారా నిఘా ఉంచాలని తెలియజేశారు.
@APPOLICE100
#AndhraPradeshStatePolice
#anakapallipolice
#AndhraPradeshPolice