- సాయిధ ధలాల పతాక దినోత్సవం..
బిబిఎంఏ న్యూస్/హైదరాబాద్
సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని సైనిక సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష రూపాయల విరాళం అందజేశారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సైనిక్ వెల్ఫేర్ విభాగం డైరెక్టర్ కల్నల్ పి.రమేశ్ కుమార్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి ని కలిసి త్రివర్ణ పతాక స్టిక్కర్‌ను అందించారు.
యుద్దంలో గాయపడిన వీర సైనికుల పునరావాసం, వారి కుటుంబాల సంక్షేమం, పునర్నివాసం వంటి కార్యక్రమాలకు ఉద్దేశించిన సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఒక లక్ష రూపాయల విరాళం అందించారు.