కంభంలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్..
బీబీఎంఏ న్యూస్ / ప్రకాశం జిల్లా:
మార్కాపురం డివిజన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను కంభం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుపడ్డ దొంగ నుంచి రూ..5 లక్షల విలువచేసే బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్లు కంభం సర్కిల్ సిఐ మల్లిఖార్జున్, ఎస్సై నరసింహారావు సమక్షంలో కంభం మండలం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మార్కాపురం డివిజన్ డీఎస్పీ నాగరాజు తెలియజేశారు. భూపతి పల్లికి చెందినఈశ్వర్ రెడ్డి తర్లపాడులో ఒకటి, కంభంలో రెండు దొంగతనాలు చేసినట్లుగా డీఎస్పీ తెలిపారు. విలేకర్ల సమావేశంలో సీఐ మల్లికార్జున్, ఎస్సై నరసింహారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు…