*భూపాలపల్లి జిల్లా దేవరాంపల్లి లో దారుణ హత్య…
బిబిఎం ఎ న్యూస్ /భూపాలపల్లి జిల్లా: డిసెంబర్ 14
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈరోజు దారుణం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం జయ శంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల పరిధిలోని దేవరాంపల్లి గ్రామానికి చెందిన సారయ్య అనే వ్యక్తిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్టు తెలిసింది..
సారయ్యను హత్య చేసేముందు అతని కళ్ళల్లో కారం చల్లి గొడ్డన్ల తో నరికి చంపినట్లు స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న కాటారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహాదేవపూర్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించినట్లు తెలిసింది..
ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది