కమీషనరేట్ పరిధిలో జాతీయ మెగా లోక్ అదాలత్ లో మొత్తం (9642) కేసులు పరిష్కరించబడినాయి*
82 సైబర్ క్రైమ్ కేసులలో బాధితులకు రూ. 8,58,716/- తిరిగి అందజేత..
బిబిఎంఏ న్యూస్ / రామగుండం
తేది :14-12-2024 రోజున జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా రామగుండం కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలో ఉన్న వివిధ పోలీసు స్టేషన్లలో నమోదై అండర్ ఇన్వెస్టిగేషన్ మరియు కోర్టు విచారణలో ఉన్న ( కాంఫౌండబుల్) ఐపిసి కేసులు (784)
📌 డ్రంక్ అండ్ డ్రైవ్, MV Act యాక్ట్ కేసులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులు (3045).
📌Disaster Management Act cases) – 428
📌 ఇ-పెట్టి కేసులు, బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన మరియు తదితర పెట్టి కేసులు (5385). మొత్తం కేసులు (9642) పరిష్కరించబడినాయి అని రామగుండము పోలీస్ కమీషనర్ పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి తెలిపారు
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ…..రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది గత 15 రోజుల నుండి కేసులలో ఉన్న కక్షిదారులను స్వయంగా కలిసి రాజీ మార్గం రాజ మార్గమని, లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని, మరియు ఇరు వర్గాలకు న్యాయం జరుగుతుందని అవగాహన కల్పించినందున టార్గెట్ కు మించి కేసులు పరిష్కరించబడినాయి తెలిపారు. కేసుల పరిష్కారానికి కృషి రాష్ట్రంలో మంచి స్థానంలో నిలిచినందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులను సిబ్బందిని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి అభినందించారు. త్వరలో కోర్టు సిబ్బందికి, ప్రతిరోజు మానిటర్ చేసిన అధికారులకు, త్వరలో రివార్డ్స్ అందజేస్తామని తెలిపారు. కమిషనరేట్ లో వివిధ సమావేశాలు ఏర్పాటు చేస్తూ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి కృషి చేసిన రెండు జోన్ ల ప్రధాన న్యాయమూర్తి లకు , జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు పోలీస్ శాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతిరోజు శాంతి భద్రతల సమస్యలను పరిరక్షిస్తూ అదేవిధంగా కోర్టు డ్యూటీ విధులను పర్యవేక్షిస్తూ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి కృషిచేసిన అధికారులు , సిబ్బంది తదితరులను సీపీ ప్రత్యేకంగా అభినందించారు.