రామగుండం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన సీపీ..

0
27

రామగుండం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన సీపీ..

 

వార్షిక తనీఖీల్లో భాగంగా రామగుండం సర్కిల్ ఆఫీస్, రామగుండం పోలీస్ స్టేషన్ ను రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి ఈరోజు తనీఖీ చేసారు.

 

తనీఖీ లో భాగంగా రామగుండం పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్‌ కమిషనర్‌కు పోలీస్‌ అధికారులు మొక్కను అందజేసి స్వాగతం పలకగా, సాయుధ పోలీసులు గౌరవ వందనం చేసారు. అనంతరం ముందుగా పోలీస్ కమిషనర్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి పోలీస్‌ కమిషనర్‌ డిసిపి , ఎసిపి తో కలిసి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు .

 

అనంతరం పోలీస్ కమిషనర్ స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరును,రికార్డ్స్ పరిశీలించడంతో పాటు వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగిందని పోలీస్ కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న సిడి ఫైల్స్ ను, పెండింగ్ ట్రాయల్లో ఉన్న సిడి ఫైళ్లను, గ్రేవ్ కేసెస్ లలో ఉన్న సిడి ఫైళ్లను పరిశీలించారు. నిందితుల అరెస్ట్, రౌడీ షీటర్ల వివరాలు, కోర్ట్ లో పెండింగ్ లో వున్న కేసులు, వాటికి సంబందించిన దర్యాప్తు వివరాలను, రోడ్డు ప్రమాదాల నివారణకు ,నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు పోలీస్ కమిషనర్ సబ్ ఇన్స్ స్పెక్టరు ను అడిగి తెలుసుకున్నారు. అలాగే స్టేషన్ లో నిర్వహిస్తున్న పలురకాల రికార్డులను పోలీస్ కమిషనర్ పరిశీంచారు.

ఈ తనిఖిల్లో పెద్దపల్లి దికిపిఒ చేతన ఐపిఎస్.,గోదావరిఖని ఎసిపి ఎం.రమేష్,రామగుండము సి ఐ ప్రవీణ్ కుమార్ ,రామగుండము ఎస్ఐ సంద్యారాణి ,ఎన్టిపిసి ఎస్ఉ ఉదయ్ కిరణ్ ,అంతర్గం ఎస్ ఐ వెంకట్ ఉన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here