ఖనిలో కలకలం రేపిన కత్తిపోట్లు..
- యువకుడి హత్యాయత్నం..
బిబిఎంఎ న్యూస్ /గోదావరిఖని:
కుటుంబ కలహాల నేపథ్యంలో గోదావరిఖనిలో పట్టపగలే యువకుడి పై హత్యాయత్నం ఘటన కలకలంరెపింది.
మంగళవారం జూనియర్ కళాశాల మైదానంలో నంది శ్రీనివాస్ అనే యువకుడిపై సమీప బంధువు శ్రవణ్ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కత్తిపొట్లతో తీవ్ర రక్తస్రావంలో పడి ఉన్న శ్రీనివాస్(38) స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. శ్రీనివాస్ ను ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా కరీంనగర్ కు తరలించారు. కాగా పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం గోదావరిఖని వినోభానగర్ కు నంది శ్రీనివాస్ అక్క కూతురు కు భీమారం కు చెందిన శ్రావణ్ తో వివాహం కాగా వారి కుటుంబ కలహాల నేపథ్యంలో శ్రీనివాస్ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. శ్రావణ్ ఇతనిపై అనుమానం, కక్ష పెంచుకొని మంగళవారం పథకం ప్రకారం గోదావరిఖనికి వచ్చి మాట్లాడేది ఉందని జూనియర్ కళాశాల మైదానం తీసుకువచ్చి దాడి చేశారు. ఘటన ను 1టౌన్ పోలీసులు తీవ్రంగా పరిగణించి భీమారం కు వేళ్లే మార్గమధ్యంలో వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ లు ప్రత్యేక చర్యలు చేపట్టి నిందితుడిని గంగానగర్లో అదుపులోకి తీసుకున్నారు. నిందితున్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించామని ఎసిపి ఎం రమేష్ తెలిపారు.