రోడ్డు భద్రత నిబంధనలు అందరూ తప్పనిసరిగా పాటించాలి: పోలీస్ కమిషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్.,

0
12

భద్రత మీ జీవితానికి సురక్ష… ప్రమాదారహిత కమీషనరేట్ గా మార్పుకు అందరం సహకరించాలి

 

రోడ్డు భద్రత నిబంధనలు అందరూ తప్పనిసరిగా పాటించాలి: పోలీస్ కమిషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్.,*

*రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా కమిషనరేట్ లో 5K రన్*

ప్రమాద రహిత కమిషనరేట్ గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలి అని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో 5కే రన్ చేపట్టారు. ఇట్టి కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ సీఎం శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి  ముఖ్య అతిథిగా హాజరై ముందుగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించి సిపి గారు అనంతరం శాంతి కపోతాలను ఎగరవేసి 5కే రన్ ను జెండా ఊపి ప్రారంభించి పోలీస్ అధికారులు, సిబ్బంది తో కలిసి కమిషనరేట్ కార్యాలయం నుండి మున్సిపల్ కార్యాలయం మీదుగా గాంధీ చౌరస్తా వరకు పెద్దఎత్తున 200మంది పోలీస్ అధికారులు, సిబ్బంది తో నిర్వహించిన 5K రన్ లో పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ..వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే కుటుంబానికి ఆసరాగా ఉంటారని, వారి జీవితాలకు భరోసా ఉంటుందని సీపీ గారు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాహనదారులు మాత్రమే వాహనాలు నడపాలన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, ఎక్కువ శాతం మంది హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారన్నారు. కార్లు నడిపే వారు విధిగా సీటు బెల్టు పెట్టుకోవాలని, వాహనాలు నడిపే సమయంలో వాహనాలకు సంబంధించిన పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలనీ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని యువత తాత్కాలిక ఆనందం కోసం ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవ్, చేస్తూ విలువైన ప్రాణాలు విడిస్తున్నారు, ప్రమాదాలకు గురై తల్లితండ్రులకు మనో వేదనను మిగిలిస్తున్నారు. తోటి వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ప్రతి సంవత్సరం అవగాహన చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ తగ్గడం లేదని ప్రజలు చైతన్యవంతులై ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు వారికి సహకరించాలన్నారు గత ఏడాది కాలంలో రామగుండం కమిషనరేట్ ట్రాఫిక్ పోలీస్ వారు ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు 13 కోట్ల రూపాయల జరిమానాలు విధించడం జరిగింది అని సిపి  తెలిపారు.

 

5K రన్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని సిపి  అభినందించారు..

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, పెద్ద పెళ్లి ఏసిపి జి కృష్ణ, బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు, ఏ ఆర్ ఏ సి పి లు ప్రతాప్, సుందర్రావు , ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు అనిల్ కుమార్, సత్యనారాయణ, లు కమీషనర్ పరిధిలోని సిఐలు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here