గంజాయితో పట్టుబడ్డ ఐదుగురు పై కేసు నమోదు

0
45

*
గంజాయితో పట్టుబడ్డ శ్రీ పాద కాలనీ వ్యక్తులపై కేసు నమోదు*
బిబిఎంఏ న్యూస్/మంథని: అక్టోబర్ 22
మంథని పట్టణంలోని శ్రీపాద కాలనీలో గంజాయితో పట్టుబడ్డ ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు మంథని ఎస్ఐ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు ఒక వ్యక్తి నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తున్నాడన్న పూర్తి సమాచారం మేరకు మంథని స్థానిక బస్ డిపో దగ్గర ఉండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తన చేతిలో బ్లాక్ కలర్ బ్యాగుతో ఉండి మా సిబ్బందిని చూసి పారిపోవడానికి ప్రయత్నించగా ఆ వ్యక్తిని పట్టుకొని పరిశీలించగా అతని బ్లూ కలర్ ప్లాస్టిక్ బ్యాగులో ఆకులు, పువ్వులు ఘాటు అయిన వాసనతో కనిపించాయని ఆ వ్యక్తిని విచారించగా గంజాయి అని తెలపడం జరిగిందన్నారు. ఆ వ్యక్తి అందించిన సమాచారం మేరకు కుడుదుల సూర్య వర్ధన్ విద్యార్థి 21 సం!! గత కొన్ని రోజుల నుండి తనకు పరిచయస్తులైన తైడాల సురేష్, పెండ్యాల సునీల్ అసంపెళ్లి తరుణ్,లక్కరవి వర్మలతో కలిసి గత కొంతకాలంగా గంజాయి కి అలవాటు పడి తాగుతున్నామని గతంలో కూడా కొనుక్కొని వచ్చి తాగినామని వారు తెలిపారు. మేమందరం తల కొన్ని రూపాయలు జమ చేసి ఆ డబ్బులతో మహారాష్ట్రలోని, చంద్రపూర్ కి వెళ్లి కార్తీక్ అనే వ్యక్తి దగ్గర గంజాయి కొనుగోలు చేసి తాగేందుకు శ్రీపాద కాలనీ కి వెళ్లి నలుగురు వ్యక్తులు కలిసి మంథని బస్ డిపో వద్ద ఉండగా పోలీసులను చూసి భయపడి వారు పారిపోతుండగా మా సిబ్బంది వారిని పట్టుకుని కేసు నమోదు చేశామని ఎస్ఐ రమేష్ తెలిపారు. మంథని పట్టణంలో యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటు పడి గంజాయి సేవించిన అక్రమ రవాణా చేసిన చట్ట పరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని తెలిపారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here