దాసాఆంజనేయ విగ్రహ నిర్మాణం పనులను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ దంపతులు..
బీబీఎంఏ న్యూస్ //రామగుండం,
రామగుండం ప్రాంతంలో అతిపెద్ద దాసాఆంజనేయ విగ్రహ నిర్మాణం పనులను శంకుస్థాపన చేసి చేసిన రామగుండం శాసనసభ్యులు ఎం ఎస్ రాజ్ ఠాగూర్ వారి సతీమణి మనాలి ఠాగూర్.
ఈ వసంత పంచమి సందర్భంగా దాసా ఆంజనేయ స్వామిగుడి, 108 అడుగుల విగ్రహానికి పూజా కార్యక్రమం నిర్వహించి శంకుస్థాపన పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ రాముడు నడిచిన నేలగా గుర్తింపు పొందిన రాముని గుండాల పేరిట ఆధ్యాత్మిక కేంద్రం లో 1800 సంవత్సరాల క్రితం నాటి పురాతన ఆంజనేయ స్వామి విగ్రహం బయటపడడంతో గుడి నిర్మాణం తో పాటు దేశంలోనే అతి పెద్దదైన 108 అడుగుల దాసాంజనేయ విగ్రహ నిర్మాణానికి ఎనిమిది కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నాం అని ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి చూపిస్తానని రాజ్ ఠాకూర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ విభాగాల అధ్యక్షులు భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.