ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడ్డా దొంగ అరెస్టు…
- 3.1కిలోల వెండి..3 తులాల బంగారం స్వాధీనం.
ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల.
వి బి ఎం ఏ న్యూస్ //భైంసా
నిర్మల్ జిల్లా భైంసా పట్టణ పరిధిలో ఆలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు చాకచక్యంగా పట్టుకుని, చొరికి గురైన 3.1కిలోల వెండి..3 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చోరీ సొత్తును కొనుగోలు చేసిన వ్యాపారి,దొంగతనాలకు సహకరించిన దొంగ భార్య పై సైతం కేసులు నమోదు చేశారు.మంగళవారం భైంసా క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఏఎస్పీ అవినాష్ కుమార్, సిఐ గోపీనాథ్, ఎస్ఐలు శ్రీనివాస్ యాదవ్, గౌస్అహ్మద్ లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కు చెందిన విజయ్ షిండే (36) గత కొంత కాలంగా మహారాష్ట్ర బలరాంపూర్ లో నివాసం ఉంటు దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇటు భైంసా పట్టణంలోని నరసింహ మందిర్, ఫూలే నగర్ హనుమాన్ మందిర్, సంతోషిమాత మందిర్, బాలాజీ దేవాలయం తో పాటు నిర్మల్ రోడ్డు మార్గంలోని హిమ వైన్స్ లో సైతం వరుస దొంగతనాలకు పాల్పడ్డాడు. ఆనవాళ్లు మిగల్చకుండా దొంగ చాకచక్యంగా తనపని ముగిస్తుందటంతో పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి దొంగను పట్టుకుని విచారించగా ఒప్పుకున్నట్లు ఎస్పీ తెలిపారు. చోరికి పాల్పడ్డ వెండి బంగారాన్ని అమ్మకానికి నిందితుని భార్య పూజ షిండే, వ్యాపారి పాండురంగ రామారావులను గుర్తించాం, చోరికి పాల్పడ్డ విజయ్ షిండే లను రిమాండ్ కు తాలిస్తున్నము త్వరలోనే పై ఇద్దరినీ అరెస్టు చేస్తామని ఎస్పి డాక్టర్ జానకి షర్మిల వెల్లడించారు. ఈ కేసును చేదించటంలో చాకచక్యంగా వ్యవహరించిన భైంసా పోలీస్ ను ఎస్పీ అభినందించారు.