పోలీస్ సిబ్బందికి హెల్త్ కార్డు లను అందించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ. పి.ఎస్.గారు.

 

ఈ రోజు పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం నందు 1991 బ్యాచ్ కి చెందిన ఎస్సైలు ( ప్రస్తుత డి.ఎస్.పి.లు) ల ఆధ్వర్యంలో 25 ప్రముఖ హాస్పిటల్స్ మరియు 100 మంది ప్రముఖ డాక్టర్ల సహకారంతో పోలీస్ సిబ్బందికి హెల్త్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ. పి.ఎస్ గారు పాల్గొని ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ. పి.ఎస్ గారి చేతులమీదుగా పోలీస్ హెల్త్ కార్డులను అందించడం జరిగింది. అనంతరం పోలీస్ వారికి సేవ చేయాలనే సదుద్దేశంతో ముందుకు వచ్చిన డాక్టర్లను అభినందించి మెమెంటో మరియు పుష్ప గుచ్చంతో చిరు సత్కారం చేయడం జరిగింది.

 

ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ గారు మాట్లాడుతూ….. పోలీసులు ప్రజలకు చేస్తున్న సేవలలో భాగంగా పోలీస్ వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ఫ్రీ కన్సల్టేన్సీ మరియు వారికి చికిత్స పరంగా అయ్యే ఖర్చులో 20 నుండి 30 శాతం వరకు తగ్గింపు ఇచ్చేలా ముందుకు రావడం అనేది చాలా సంతొషించదగ్గ విషయం అని, ఈ విధంగా సహకరించడానికి ముందుకు వచ్చిన ప్రముఖ డాక్టర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా పోలీస్ మరియు వారి కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న వైద్యపరమైన భారాన్ని తగ్గించాలనే లక్ష్యంతో నగరంలోని ప్రముఖ డాక్టర్లను కలిసి పోలీస్ కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి డాక్టర్లకు అవగాహన కల్పించి వారిని ఈ కార్యక్రమంలో బాగాస్వాములుగా చేయడంలో కీలకంగా వ్యవహరించిన 1991 బ్యాచ్అధికారులను ప్రత్యేకంగా అబినంధించారు. అనంతరం యువత మత్తు పదార్థాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్లతో కూలకుషంగా చర్చించడం జరిగింది.

 

సమాజంలో పోలీస్ పాత్ర చాలా కీలకమైనది. సమాజంలో శాంతి భద్రతలను కాపాడడంలో పోలీస్ కీలకంగా వ్యవహరిస్తారు. ఈ క్రమంలో సరైన సమయం లేకుండా పని ఒత్తిడి లో ఉండటం వలన ఎక్కువగా అనారోగ్యం బారిన పడుతుంటారు, ఆరోగ్య భద్రత లో అన్ని వ్యాదులకు చికిత్స అందకపోవడం మరియు వారి కుటుంబ సభ్యుల అనారోగ్య బారిన కూడా వారికి కూడా సరైన చికిత్స చేయించడానికి చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో 1991 బ్యాచ్ అధికారులు గడిచిన వారి 34 సంవత్సరాల సర్వీస్ కాలంలో పోలీస్ సిబ్బంది ఆరోగ్య పరంగా పడుతున్న బాధలను కష్టాలను గమనించి పోలీస్ మరియు పోలీస్ కుటుంబాలకు ఆరోగ్యం పరంగా ఉపయోగపడేలా ఏదైనా చేయాలానే సదుద్దేశంతో నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ పి ఎస్. గారి సూచనలతో 1991 బ్యాచ్ అధికారులు పోలీస్ మరియు వారి కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న వైద్యపరమైన భారాన్ని తగ్గించాలనే లక్ష్యంతో నగరంలోని ప్రముఖ డాక్టర్లను కలిసి పోలీస్ కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి డాక్టర్లకు అవగాహన కలిపించడం జరిగింది.

 

ఈ నేపధ్యంలో నగరం లోని 25 ప్రముఖ హాస్పిటల్స్ వారు న్యూరాలజిస్ట్, అలెర్జీ మరియు వెర్టిగో స్పెషలిస్ట్, డయాబెటాలజిస్ట్, రేడియాలజిస్ట్, ఆర్థోపెడిక్ సర్జరీ, ENT స్పెషలిస్ట్, ప్రసూతి మరియు గైనకాలజీ, డెర్మటాలజిస్ట్ మరియు కాస్మోటాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజీ, కార్డియాలజిస్ట్, పల్మోనాలజీ, గ్యాస్ట్రో & ఆంకాలజీ, లాపరోస్కోపిక్ మొదలైన 30 ప్రత్యేక విభాగాలకు చెందిన 100 మంది డాక్టర్లు స్పందించి పోలీసులు ప్రజలకు చేస్తున్న సేవలలో భాగంగా వారికీ మా వంతు సాయంగా మేము కూడా అండగా ఉంటామని పోలీస్ వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ఫ్రీ కన్సల్టేన్సీ మరియు వారికి చికిత్స పరంగా అయ్యే ఖర్చులో 20 నుండి 30 శాతం వరకు తగ్గింపు ఇచ్చేలా చూడటం జరుగుతుందని సహృదయంగా తెలియజేసినారు.

 

డి.ఎస్.పి శ్రీ పి. వి.మారుతీ రావు గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లాలోని పోలీసులు అందరికీ పూర్తి వివరాలతో కూడిన హెల్త్ కార్డును అందించడం జరుగుతుంది. అనంతరం అందరికి ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఏర్పాటు చేసి అందులో హాస్పిటల్స్ మరియు డాక్టర్ల వివరాలను పొందుపరచడం జరుగుతుంది. అప్పటి నుండి ఈ హెల్త్ కార్డులు ఉపయోగం లోనికి వస్తాయి. పోలీస్ సిబ్బంది హెల్త్ స్కీమ్ లో ఉన్న హాస్పిటల్ కి వెళ్లే సమయంలో హెల్త్ కార్డ్ మరియు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకుని వెళ్లాలి.

 

ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ గారితో పాటు, డి.సి.పి.లు శ్రీ గౌతమీ షాలి ఐ.పి.ఎస్.గారు, శ్రీమతి కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్.గారు, ట్రైనీ ఐ.పి.ఎస్. శ్రీ మనీషాగారు, 1991 బ్యాచ్ శ్రీ పి. వి. మారుతీ రావు గారు, శ్రీ దామోదర రావు గారు, శ్రీ ఏ ఆర్ కోటేశ్వరరావు గారు, శ్రీ రతన్ రాజు గారు, శ్రీ మెహర్ బాబు గారు, శ్రీ సత్యానందం గారు, శ్రీ దుర్గారావు గారు, శ్రీ మురళీధర్ గారు, శ్రీ వంశీధర్ గౌడ్ గారు, శ్రీ ధర్మేంద్ర గారు, శ్రీ రాజీవ్ కుమార్ గారు, శ్రీ భాస్కర్ రావు గారు , శ్రీ రఘురాం మోహన్ గారు, శ్రీ డి ప్రసాద్ రావు గారు, 25 ప్రముఖ హాస్పిటల్స్ మరియు 100 మంది ప్రముఖ డాక్టర్లు మరియు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

#healthcard #policepersonnel #comissionerofpolice #ntrdistrict #VijayawadaCityPolice #andhrapradesh #AndhraPradeshStatePolice Dgp Andhra Pradesh Andhra Pradesh Police

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here