పెద్దపల్లి, నవంబర్ -14:
““““““““““““““““““““““““““““`
పెద్దపల్లి జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహణ
““““““““““““““““““““““““““““`
కేంద్ర ప్రాయోజిత పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి….. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు
——————————————-
✅ నేషనల్ హెల్త్ మిషన్ నిధులను సమర్థవంతంగా వినియోగించాలి.
✅ విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందేలా చూడాలి.
——————————————-
గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ కృష్ణ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ , డి.వేణు లతో కలిసి జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు.
దిశ సమావేశంలో ప్రస్తుతం వారి శాఖల పరిధిలో అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు, రాబోయే 3 నెలల కాలంలో నిర్దేశించుకున్న లక్ష్యాలు తదితర అంశాల పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, విద్యుత్ శాఖ,జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా సంక్షేమ అధికారి, జీఏం పరిశ్రమలు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి , జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, రోడ్లు భవనాల శాఖ, ఈఈ హౌసింగ్, మున్సిపల్ కమిషనర్ , పీ.డీ జాతీయ రహదారులు, వ్యవసాయ శాఖ అధికారులు నివేదికలు వివరించారు.