#TELANGANA POLITICAL NEWS..

0
4

“అర్హులైన రైతులందరికీ రుణ మాఫీ చేసే బాధ్యత ప్రజా ప్రభుత్వానిది. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 22 లక్షల రైతు కుటుంబాలకు 18 వేల కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ చేశాం. మాట ఇస్తే మడమ తిప్పకుండా అందరికి రుణమాఫీ చేసే బాధ్యత మాది. మీ ఖాతాల్లో పొరపాట్లను సవరించుకోండి. రుణమాఫీపై తప్పుడు మాటలు నమ్మకండి. మీకు అండగా నిలబడుతా” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు.

♦️రాష్ట్రానికి ప్రతి నెలా 18,500 కోట్ల ఆదాయం వస్తుంటే, అందులో దాదాపు 6,500 కోట్లు జీతాలు, పెన్షన్ల కింద చెల్లిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల అప్పులపై అప్పు, వడ్డీ కింద మరో 6,500 కోట్లు పోతున్నాయని, ఇక మిగిలిన 5,500 కోట్ల ఆదాయం ఉంటే… ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ రూపాయి రూపాయి కూడబెట్టి రైతు రుణమాఫీ చేశామని చెప్పారు.

♦️ఏడాది పాలన సందర్భంగా “ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు” కార్యక్రమంలో భాగంగా ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని వరంగల్ నగరంలో ఏర్పాటు చేసిన ఇందిర మహిళా శక్తి సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ వేదిక నుంచి ఒకేసారి 22 జిల్లాల్లో ఇందిరా మహిళాశక్తి భవనాలకు శంకుస్థాపన చేశారు.

♦️మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణ, బీమా చెక్కులను అందజేశారు. మహిళా సంఘాలు నిర్వహించే సౌర విద్యుత్ కొనుగోలుపై డిస్కంలు – సెర్ప్ కు మధ్య కుదిరిన ఒప్పంద పత్రాలను సీఎంగారి సమక్షంలో మార్చుకున్నారు.

♦️ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, ఇతర మంత్రివర్గ సహచరులు, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్ని సీఎంగారు ముందుగా స్వయం సహాయక మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. అనంతరం అశేషంగా హాజరైన మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు.

♦️స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ రాష్ట్రం పండించనంత ధాన్యం పండింది. 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించారు. ఈ ధాన్యానికి ఎంఎస్పీతో పాటు సన్నబియ్యానికి 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొంటున్న రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమే.

♦️ఎంతో చారిత్రక ప్రాముఖ్యత, ప్రాశస్త్యం కలిగిన వరంగల్ జిల్లా గత పదేండ్లలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేక నిర్లక్ష్యానికి గురైంది. అందుకే హైదరాబాద్‌తో సమానంగా అభివృద్ధి చేయాలని సంకల్పించాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే భౌగోళికంగా సగం తెలంగాణను అభివృద్ధి చేసినట్టవుతుంది.

♦️జాతీయస్థాయి పరిశ్రమలు, ఇక్కడ ఎయిర్‌పోర్టు రావడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కాకతీయ వర్సిటీ అభివృద్ధి పథంలో నడిపించడం ద్వారా సగం తెలంగాణ అభివృద్ధి బాట పట్టినట్టేనని భావించి ఈ బాధ్యత తీసుకుంది.

♦️మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఐదారు ఎయిర్ పోర్టులు ఉంటే… తెలంగాణలో ఒకే ఒక్క ఎయిర్‌పోర్టు ఉంది. అందుకే వరంగల్‌తో పాటు కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్‌లలో కూడా విమానాశ్రయాలను స్థాపించి రాష్ట్రంలో పెట్టుబడులను తెచ్చి పరిశ్రమలను పెట్టుకుని తెలంగాణను అభివృద్ధి పథంవైపు నడిపించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది.

♦️తెలంగాణ పౌరుషానికి మారుపేరు కాళోజీ గారిని గుర్తించని ప్రపంచమే లేదు. ప్రజాకవి కాళోజీ గారి ప్రభావం అందరిపైనా బలంగా ఉంది. కళాప్రాంగణాన్ని గత ప్రభుత్వం పదేండ్లు విస్మరించింది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు కేటాయించి పూర్తి చేశాం.

♦️ఇది మీరిచ్చిన ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నం. ఏ గడ్డ నుంచి పోరాటం మొదలుపెట్టామో ఏడాదికాలం పూర్తి చేసుకున్న సందర్భంగా అదే గడ్డమీద ఉత్సవం జరుపుకున్నం.

♦️నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డల కోసం ఒక్క రోజు… ఒక్క నిమిషం… సెలవు తీసుకోకుండా రోజు 18 గంటలు పనిచేస్తా. ఆఖరు శ్వాస వరకు… చివరి రక్తపు బొట్టు వరకు… తెలంగాణ కోసం అంకితమవుతా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here