వాయిస్: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో సమావేశమైన కేబినెట్ కీలకు బిల్లులకు ఆమోదం తెలిపింది. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సహా సూపర్‌సిక్స్ హామీలు పరిశ్రుమలకు భూకేటాయింపులపై కేబినెట్‌లో చర్చ జరిగింది.
ఏపీలో రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి.ఎస్‌ఐపీబీ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.నేరాలను నియంత్రించేలా పీడీయాక్ట్ పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది ఏపీ కేబినెట్.అలాగే లోకాయుక్త చట్ట సవరణ బిల్లు సహా దేవాలయ కమిటీల్లో ఇద్దరు సభ్యులకు చోటు కల్పించేలా చట్టసవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.