జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ – ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సదుపాయాల కల్పనపై ఆదేశాలు
బిబిఎంఎ న్యూస్/ భూపాల్ పల్లి
ఈ తనిఖీ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికార యంత్రాంగానికి సహకారాన్ని అందించాలని కలెక్టర్ సూచించారు. అంతకు ముందు రూపిరెడ్డిపల్లి రైతు సహకార సంఘం లో ఆరబోసిన ధాన్యం రాసులను పరిశీలించి, తేమ శాతాన్ని పరిశీలించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్నివిధమైన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులకు ఏవైనా సమస్యలు ఎదురైతే, వాటిని తక్షణమే పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రాల ఇంచార్జీలదేనని ఆయన స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు వస్తే సహించబోమని, ఏమైనా లోపాలు తలెత్తితే ఇంచార్జీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్, మార్కెటింగ్ అధికారి కనక శేఖర్, డిఎస్పీ సంపత్ రావు, రైతు సహకార సంగం చైర్మన్ బుచ్చిరెడ్డి, పిఏసీఎస్ సీఈఓ జగన్మోహన్, కొనుగోలు కేంద్రం ఇంచార్జి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.