*BBMA – Morning Top9 News*
*BBMA - Morning Top9 News*
ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్-2024కు కేబినెట్ ఆమోదం
తెలంగాణలో 78 శాతం పూర్తయిన సమగ్ర కుటుంబ సర్వే
విశాఖ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులకు రిమాండ్
మాగనూర్ స్కూల్‌లో ఫుడ్ పాయిజన్, 50 మందికి అస్వస్థత
HYD మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నవీన్ సూసైడ్
శబరిమలలో భక్తుల రద్దీ, అయ్యప్ప దర్శనానికి10 గంటలు
ఈ నెల 23న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయుకాలుష్య తీవ్రత
మహారాష్ట్ర,జార్ఖండ్ ఎగ్జిట్‌పోల్స్‌లో ఎన్డీఏదే హవా
#TELANGANA POLITICAL NEWS
వరంగల్ నగరంలో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అంకితం చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారు, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధుల తోడుగా కళాక్షేత్రానికి ప్రారంభోత్సవం చేశారు. అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజా కవి కాళోజీ నారాయణ రావు గారి విగ్రహాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు.
కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కాళోజీ గారి ఫోటో గ్యాలరీని, అలాగే తొలి ప్రదర్శనగా వారి జీవితంలోని కొన్ని ఘట్టాలను గుర్తుచేస్తూ రూపొందించిన లఘుచిత్రాన్ని వీక్షించారు. అక్కడే డిజిటల్ పద్ధతిలో వివిధ...
#TELANGANA POLITICAL NEWS..
“అర్హులైన రైతులందరికీ రుణ మాఫీ చేసే బాధ్యత ప్రజా ప్రభుత్వానిది. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 22 లక్షల రైతు కుటుంబాలకు 18 వేల కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ చేశాం. మాట ఇస్తే మడమ తిప్పకుండా అందరికి రుణమాఫీ చేసే బాధ్యత మాది. మీ ఖాతాల్లో పొరపాట్లను సవరించుకోండి. రుణమాఫీపై తప్పుడు మాటలు నమ్మకండి. మీకు అండగా నిలబడుతా” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు.
♦️రాష్ట్రానికి ప్రతి నెలా 18,500 కోట్ల ఆదాయం వస్తుంటే, అందులో దాదాపు 6,500...